భద్రాద్రి కొత్తగూడెం: బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ బిజెపి వెంటనే స్పందించింది. ఆయనని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో చిన్ని మాట్లాడుతూ.. బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కలలు కన్న తెలంగాణ కోసం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు.
తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగాలన్నారు. ఓట్లు విడిపోయి కాంగ్రెస్ బలపడితే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. కేసీఆర్ కు అండగా నిలబడడం కోసం బిఅర్ఎస్ లో చెరికకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కేసీఆర్ ఆహ్వానించి భరోసా ఇచ్చారన్నారు. ఈ నెల చివరలో బిఅర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటించారు. నమ్మి వచ్చే కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయని.. బిఅర్ఎస్ లో పటిష్ట నాయకత్వం లేదన్నారు. బిజెపిలో ఇటీవల పరిణామాలు నిరాశ పరిచాయన్నారు చిన్ని.