Padi Koushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద మోహరిస్తున్నారు పోలీసులు. అటు హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయ వద్దకు చేరుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
దీంతో కార్యకర్తలను అదుపు చేస్తున్నారు పోలీసులు. అంతేకాదు.. చెల్పూర్ లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకోకుండా ఇరు పార్టీల నాయకులను హౌజ్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. మంగళవారం ఉదయం చేల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తూనని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ విసిరారు. అయితే…హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ పై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నా అన్నారు.