యుద్ధాన్ని ఆపే ఏ ఒప్పందాన్నీ అంగీకరించం : నెతన్యాహు

-

ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య భీకర పోరు ఇంకా సాగుతోంది. ముఖ్యంగా హమాస్ను మట్టుబెట్టాలని ప్రతిన పూనిన ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరు వర్గాలు కాల్పుల విరమణ పాటించేలా ప్రపంచ దేశాలు ప్రయత్నించినా అవి విఫలమయ్యాయి. తాజాగా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్ప గాజాలో శాశ్వతంగా యుద్ధాన్ని నివారించే ఏ ఒడంబడికను తాము అంగీకరించబోమని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ అంతమయ్యే వరకు గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పాక్షిక ఒప్పందానికి మాత్రమే తాను సానుకూలమని వెల్లడించారు. గాజాలో పరిపాలన కూడా పాలస్తీనా అథారిటీకి అప్పగించబోమని అన్నారు. ఇజ్రాయెలీ టెలివిజన్‌ ఛానల్‌ 14కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో కీలక వ్యాఖ్య కూడా నెతన్యాహు చేశారు. మరోవైపు గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌ సరిహద్దుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆ మిలిటెంట్‌ సంస్థ దాడులు ఎక్కువయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news