శానంపూడి సైదిరెడ్డి సీటుకు ఎసరు పెడుతున్న తేరా చిన్నప రెడ్డి!

-

శానంపూడి సైదిరెడ్డి సీటుకు ఎసరు పెడుతున్నారట తేరా చిన్నప రెడ్డి. నల్లగొండ బీజేపీ ఎంపీ టికెట్ కావాలని బేరసారాలు మొదలు పెట్టారట చిన్నప రెడ్డి. నల్లగొండ జిల్లాలో పెద్దగా బలం లేని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొదట తేరా చిన్నప రెడ్డిని సంప్రదించగా ఆయన ఆసక్తి చూపించలేదని సమాచారం అందుతోంది. దీంతో హూజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ టికెట్ ప్రకటించారు బీజేపీ పెద్దలు.

కానీ ఇప్పుడు నాకు ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమంటూ చిన్నప రెడ్డి కిషన్ రెడ్డిని అడిగారని తెలుస్తోంది. ఎంపీ టికెట్ మార్చే విషయం తన చేతుల్లో లేదని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం అందుతోంది. కాగా తేరా చిన్నప రెడ్డి…బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, భువనగిరి ఎంపీ రేస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం వచ్చిందట. భువనగిరి ఎంపీ రేస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి ఉన్నారని సమాచారం అందుతోంది. ఒక వేళ భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news