కాంగ్రెస్‌ పార్టీకి డెడ్‌ లైన్‌ ఇచ్చిన సీపీఎం పార్టీ !

-

కాంగ్రెస్‌ పార్టీకి డెడ్‌ లైన్‌ ఇచ్చింది సీపీఎం పార్టీ. పొత్తులపై నేటి మధ్యాహ్నం లోపు ఏ విషయం తేల్చాలని కాంగ్రెస్ కు సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డెడ్ లైన్ విధించారు. ‘సిపిఐతో చర్చించి కుదిరితే కలిసి పోటీ చేస్తాం. లేదంటే ఒంటరిగా దిగుతాం. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పారు తమ్మినేని.

పొత్తులు కుదరకపోతే మా అభ్యర్థుల్ని ప్రకటిస్తాం. ఇప్పటికే మా పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి’ అని వీరభద్రం చెప్పారు. ఈ ఎన్నికల్లో మొదట 5 సీట్లు అడిగామని… కానీ కాంగ్రెస్‌ పార్టీ 2 సీట్లు ఇస్తామని చెప్పినట్లు వివరించారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అయినా తాము ఒప్పుకున్నామని.. కానీ ఇప్పుడు మాట మార్చినట్లు చెప్పారు. తమకు 2 కంటే తక్కువ సీట్లు ఇస్తే.. తెలంగాణలో సొంతగా పోటీ చేస్తామని వెల్లడించారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

Read more RELATED
Recommended to you

Latest news