కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేసుకోవడం ఓకే… కానీ ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించరు అని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. రైతుభరోసా, రైతు రుణమాఫీ పై స్పష్టత లేదు. ఆరు గ్యారంటీ లు అమలులో పెట్టలేదు. రేవంత్ రెడ్డి మహిళలను బస్సు ఎక్కించడం తప్ప వేరే ఏదీ సరిగ్గా అమలు కావడం లేదు. చేసిన వాగ్దానలు అమలు కావడం లేదు. రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలు అడ్రెస్స్ లేవు. ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హైడ్రా, మూసి లాంటివి అందులో భాగమే. హైడ్రా సరైంది కాదు.. పేదల ఇండ్లు కూలాగొట్టకూడదు అని అన్నారు.
ఇక మూసి ప్రక్షాళన వేరు… ఆధునికరణ వేరు. మూసి ప్రక్షాళన చేయాల్సిందే.. హైదరాబాద్ లోని కెమికల్స్ రాకుండా చూడాలి. శుద్ధి చేసే ఫ్యాక్టరీ లు పెట్టాలి. కలెక్టర్ ను నిలదీస్తే అర్థరాత్రి ఇండ్ల మీద పడి మహిళలను ఇబ్బందులను గురి చెసారు. ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నాడు. కానీ ఏదీ ప్రజాస్వామ్యం.. ఎక్కడైనా ప్రతిపక్షలతో మాట్లాడారా.. ప్రజల సమస్యలపై చర్చించారా అని అడిగారు. ఇక రేవంత్ మాటల్లోనే ప్రజాస్వామ్యం… చేతల్లో నిర్భందకాండ ఉంది అని తమ్మినేని పేర్కొన్నారు.