ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానం స్పష్టం చేయాలి : ప్రభాకర్

-

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలు ఎవరి కోసం చేస్తున్నారని వారికే అర్థం కావడం లేదు అని బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొద్దీ గంటలకే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోనే వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకు వేయలేదు. రాజకీయంగా మాదిగలను ముంచింది కాంగ్రెస్ పార్టీ. సబ్ ప్లాన్ ను ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ నోరు మెదపడం లేదు. మాలలను ఒక కాంగ్రెస్ నాయకుడు రెచ్చ గొడుతున్నారు. మాదిగలను ఒక వెైపు ముంచి.. మరో వెైపు మాలలను రెచ్చ గొడుతున్నారు.

అయితే ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానం స్పష్టం చేయాలి. అంబేద్కర్ ను చట్ట సభల్లో అడుగు పెట్టకుండా ఓడించి, అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఏడాది సబ్ ప్లాన్ అమలు తీరు తెన్నలపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇక బీజేపీ వేసిన ఛార్జ్ షీట్ కి కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతుంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ ఏమీ సమాధానం చెబుతారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ చెయ్యకుండా పబ్బం గడుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణను దేశంలో అమలు చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతానని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఛార్జ్ షీట్ పెట్టే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news