కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె కరీంనగర్ లోని కోతి రాంపూర్ లో మీడియాతో మాట్లాడారు. కులగణనలో ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు. బీసీలకు 56.03 శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ బీసీ గణన సరిగ్గా జరగలేదు అనే మాట ప్రతి చోట వినిపించిందని, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారన్నారు. బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉన్నదా నిన్న ఆగమాగం లెక్క పెట్టారు.

రేపు అసెంబ్లీలో బిల్లు పెడుతారట అని ఆమె విమర్శించారు. పెడితే బిల్లు పెట్టండి.. మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు వెంటనే మైనార్టీలతో కలుపుకొని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే మోసం మీరు కర్ణాటకలో చేశారు అదే మోసం తెలంగాణలో చేస్తున్నారు. మీరు చెప్పిన లెక్కలు ఖాకి లెక్కలు మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్న అంటరు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తున్నది కాబట్టి 15 రోజులు రివ్యూ కి అవకాశం ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news