కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేం – కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని ప్రకటన చేసింది.

కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ కోరారని.. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని కేంద్ర జలశక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు ప్రకటన చేశారు. అందువల్ల ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు స్కీం లో చేర్చడానికి అర్హత లేదని తేల్చి చెప్పారు బిశ్వేశ్వర్ తుడు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు.