రాజస్థాన్‌లోని బోరుబావి ఘటన ఎట్టకేలకు విషాదంగా ముగిసింది. ఆ రాష్ట్రంలోని కోరుత్లీలో 10 రోజుల కిందట ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో మూడేళ్ల చిన్నారి చేతన పడిపోయిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆ బాలికను రక్షించేందుకు 10 రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింబవళ్లు శ్రమించాయి.
అయితే, నిన్న రాత్రి బోరుబావి నుంచి చిన్నారిని రెస్క్యూ సిబ్బంది విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కొన ప్రాణంతో ఉన్న చిన్నారని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలికను పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. దీంతో పది రోజుల పాటు రెస్క్యూ బృందాలు పడిన శ్రమ వృథాగా మారింది. బాలిక మృతి గురించి తెలిసి పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.