తెలంగాణ వ్యవసాయ అధికారులకు శుభవార్త.. అమెరికా పర్యటనకు అనుమతిచ్చిన ప్రభుత్వం..!

-

అమెరికాకు వ్యవసాయ మంత్రి నేతృత్వంలో అధికారుల బృందం పయనం కానుంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 3 వరకు అమెరికా పర్యటన కొనసాగనుంది. ఆగస్టు 29 నుంచి 31 వరకు ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగే ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరు కానున్నారు. అయితే అమెరికాలో ప్రముఖ వ్యవసాయక రాష్ట్రం లోవా మరియు నార్త్ కరోలినా, వాషింగ్టన్ డీసీలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. 

అమెరికా ఫెడరల్ వ్యవసాయ శాఖ కార్యదర్శి,  అమెరికా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికత, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు అధికారులు. ఈ అమెరికా పర్యటన తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేయనుంది. భవిష్యత్ లో ఆహార పరిశ్రమలతో రైతులకు వ్యవసాయం మరింత లాభసాటి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందానికి అమెరికా పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version