ఢిల్లీ ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

-

ఢిల్లీ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి రెండు విమానాల టేక్ ఆఫ్, ల్యాండింగ్ కి ఏటీసీ అనుమతి ఇచ్చింది. చివరి నిమిషంలో గుర్తించి ఒక విమానం టేక్ ఆఫ్ ని రద్దు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రెండు విమానాలు విస్తార సంస్థకు చెందినవే. ఢిల్లీ నుండి బెంగాల్ లోని బద్దోరాకు వెళుతున్న ఫ్లైట్ టేక్ ఆఫ్ కి సిద్ధం అవ్వగా.. అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి వస్తున్న విమానం లాండింగ్ కి అనుమతించడం గందరగోళానికి కారణమైంది.

చివరి నిమిషంలో ఈ తప్పిదాన్ని గుర్తించకపోతే రన్వే పై ఈ రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఏటీసీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version