అగ్ని ప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి : గవర్నర్

-

హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సిఎస్ ను ఆదేశించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

The governor sought a report on the Nampally incident

ఇక అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నాంపల్లి అగ్ని ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఒక్క మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌ నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఈ సందర్భంగా నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news