మార్గదర్శి చిట్ ఫండ్ నిధుల మళ్లింపు కేసును ముగించిన సుప్రీంకోర్ట్

-

ఢిల్లీ: శుక్రవారం సుప్రీం కోర్టులో మార్గదర్శి చిట్ ఫండ్ నిధుల మళ్లింపు కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయ పరిధి అంశంపై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మెరిట్స్ పైన హైకోర్టు నిర్ధారిస్తుందని సుప్రీమ్ తేల్చి చెప్పింది. తిరిగి అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ధర్మసనం సూచించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ముగించింది సుప్రీంకోర్టు.

కేసు విచారణ చేపట్టారు జస్టిస్ జెకే.మహేశ్వరి, జస్టిస్ కేవి. విశ్వనాథన్. చిట్ ఫండ్ పేరుతో ప్రజల నుంచి నిధులను సేకరించి దారి మళ్ళించారని మార్గదర్శిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏపీలోనే బాధితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేసులను ఏపీకే ట్రాన్స్ఫర్ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోనే నేరం జరిగిందని పిటిషన్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version