BREAKING: గాంధీ ఆస్పత్రిలో మంకీపాక్స్ వార్డు ఏర్పాటు..కేసు నమోదు కాకముందే !

-

health department has set up a monkeypox ward in Gandhi Hospital: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రి లో మంకీ పాక్స్ వార్డ్ ఏర్పాటు చేసింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మంకీ పాక్స్ కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగా గాంధీ ఆస్పత్రి లో వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అలెర్ట్ చేసిన ఆరోగ్య శాఖ…గాంధీ ఆస్పత్రి లో మంకీ పాక్స్ వార్డ్ ఏర్పాటు చేసింది.

The health department has set up a monkeypox ward in Gandhi Hospital

ఇది ఇలా ఉండగా, ప్రపంచ దేశాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంపాక్స్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే తాజాగా మంకీపాక్స్ లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దిల్లీ ఎయిమ్స్‌ మార్గదర్శకాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version