సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ తగిలింది. కుక్కల దాడి ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గడించిన ఆరు నెలల్లోనే అధికారికంగా 237 కుక్కల దాడులు జరగగా అనధికారికంగా ఇంకెన్నో జరిగాయి.
అయితే తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి ఘటనలు తరచూ జరుగుతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
అటు మహబూబ్ నగర్ జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దగ్గరికి వెళ్లిన పట్టించుకోవడం లేదని, ప్రజావాణిలో తన సమస్య పరిష్కారం అవ్వడం లేదని కలెక్టర్ ఛాంబర్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.