రేవంత్ సొంత జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సీఎం సొంత జిల్లా ప్రజావాణిలో తన సమస్యను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలతో రైతు ఆత్మహత్య విషాదం మరువక ముందే మరో ఘటన జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దగ్గరికి వెళ్లిన పట్టించుకోవడం లేదని, ప్రజావాణిలో తన సమస్య పరిష్కారం అవ్వడం లేదని కలెక్టర్ ఛాంబర్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.