మల్కాజ్‌గిరిలో నిన్న రాత్రి టెన్షన్.. టెన్షన్ నెలకొంది. మల్కాజ్‌గిరి వరకు చేరిన అల్వాల్ బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవల ప్రభావం కనిపించింది. ప్రతిఫలంగా పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు ఇరు పార్టీల నేతలు. ‘దమ్ముంటే మల్కాజ్‌గిరికి రా..’ అంటూ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేతలు.

ఇక సవాల్‌ను స్వీకరించి దాదాపు 200 మందితో మల్కాజ్‌గిరి చౌరస్తాకు చేరుకున్నారు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి రోహిత్. తద్వారా ఉద్రిక్త వాతావరణం చోటు హెసుకుంది. దింతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మల్కాజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్‌లో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో తిష్ట వేసారు కాంగ్రెస్ నాయకులు.
రౌడీలతో కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బలప్రదర్శన
బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్న మైనంపల్లి హన్మంతరావు
రౌడీలతో మల్కాజిగిరికి చేరుకున్న మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్
మల్కాజిగిరి వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్ pic.twitter.com/AuEFuBki0f
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2025