నిరుద్యోగుల జీవితాలంటే ప్రభుత్వానికి ఒక ఆటగా మారిపోయింది – విజయశాంతి

-

తెలంగాణలో వరుస పేపర్ లీకేజీల ఘటనలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బిజెపి నేత విజయశాంతి. తెలంగాణలో విద్యార్థిగా, ఉద్యోగార్ధిగా బతకడమంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందన్నారు. రాష్ట్ర పాలకుల బాధ్యతారాహిత్యం వల్ల మొన్నటికి మొన్న ప్రభుత్వోద్యోగాలకి పరీక్షలు పెట్టే టీఎస్‌పీఎస్‌సి ప్రశ్నాపత్రాలు లీకవగా… ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం, ఈ రోజున హిందీ పేపర్ లీకయ్యాయని దుయ్యబట్టారు.

ఎక్కడా కట్టుదిట్టమైన చర్యలు లేవు.. భద్రతా వ్యవస్థలు లేవు.. సరైన పద్ధతులు లేవు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలంటే ప్రభుత్వానికి ఒక ఆటగా మారిపోయిందని మండిపడ్డారు విజయశాంతి. నిరాశతో బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ఈ సర్కారు ఏ మాత్రం పట్టింపులేని తీరును ప్రదర్శిస్తోందన్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అంశాన్ని కూడా సర్కారు అటకెక్కించిందని.. దీనిపై సీఎం కేసీఆర్ గారు హామీ ఇచ్చి ఏడాది గడిచినా కదలిక లేని దుస్థితి నెలకొందన్నారు.

ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది పాతిక, ముప్ఫైయ్యేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని రెగ్యులరైజేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నరని.. వీరు రిటైర్ అయ్యేలోగానైనా రెగ్యులరైజ్ అవుతారో లేదో ఆ దేవుడికే ఎరుక.. వీలైనంత మందిని రిటైర్ చేయించి… తక్కువలో తక్కువ మందికి మాత్రమే ఆర్ధిక ప్రయోజనాలు కల్పించి డబ్బులు మిగుల్చుకోవాలనే కుట్ర కోణం కూడా ఇందులో కనిపిస్తోందని అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version