వాస్తు: ఇంట్లో, ఆఫీస్ లో ఇబ్బందులే లేకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

చాలామంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఇంట్లో వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎంతో ఆనందంగా ప్రశాంతంగా జీవించొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

 

చాలా రకాల వాస్తు దోషాలు మన ఇంట్లో ఉండొచ్చు. అటువంటి వాటి నుండి దూరంగా ఉండటం ఎంతో అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ లో ఇంట్లో ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మీ ఇంటి ముఖ ద్వారం లేదంటే ఆఫీస్ ముఖద్వారం దక్షిణ దిశ లో ఉంటే దానికి దగ్గర లో మీరు ఒక వేప మొక్కని నాటండి. అలానే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని మీరు తలుపు దగ్గర పెట్టొచ్చు.

రాయి తో చేసిన రెండు వినాయకుడి విగ్రహాలని కూడా మీరు ముఖద్వారం దగ్గర పెడితే మంచిది. దీనితో వాస్తు దోషాలు తొలగిపోతాయి ప్రశాంతంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం టాయిలెట్ రెండు దగ్గర ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఎక్కువవుతాయి. మీరు నీలం రంగు బకెట్, మగ్ ని ఉపయోగిస్తే ప్రశాంతత లభిస్తుంది. సమస్యలు దూరం అవుతాయి. అలానే ఒక బౌల్ లో కొంచెం ఉప్పు వేసి బాత్రూంలో ఒక మూలానపెట్టండి దీని వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

ఆర్థిక బాధలు నుండి కూడా బయటపడొచ్చు. బాత్రూం తప్పు వైపు ఉన్నట్లయితే మీరు బాత్రూం బయట వేటాడుతున్న సింహం ఫోటో ని పెట్టండి ఇది సమస్యల్ని పరిష్కరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొంచెం కర్పూరాన్ని ఇంట్లో లేదా ఆఫీసు లో ఎక్కడైనా ఉంచితే కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయి ఒకవేళ కనుక అది కరిగిపోతే ఇంకొకటి వెంటనే పెట్టండి ఇలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి చూశారు కదా పండితులు చెప్పినా అద్భుతమైన వాస్తు చిట్కాలని మరి వీటిని అనుసరించి ఆనందంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version