ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి పడిపోయిన లారీ..!

-

హైదరాబాద్ నగర శివారులో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి వెళ్తున్న లారీ అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడి పోయింది. భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడికి వెళ్లి చూస్తే.. అసలు విషయం తెలిసింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మరణించాడు. పెద్ద అంబర్ పేట సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఘట్ కేసర్ నుంచి పెద్ద అంబర్ పేట వైపు వస్తున్న లారీ అకస్మాత్తుగా ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి సర్వీస్ రోడ్డులో పడిపోయింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. తెల్లవారుజామున సమయం కావడంతో సర్వీస్ రోడ్డులో ఎవ్వరూ ప్రయాణించడం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. కింద పడిన లారీని గమనించిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version