సాధారణంగా ఉన్నత చదువుల కోసమో.. ఉన్నత ఉద్యోగాల కోసమో కొందరూ ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఇతర దేశాల్లో హ్యాపీగా సంతోషంగా ఉంటే ఏం పర్లేదు. కానీ కొందరూ ఈ మధ్య కాలంలో ఇతర దేశాల్లో ఏదో ఒక విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన యువకుడు కూడా కెనడాలో మరణించారు. పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాద్ నగరంలోని మీర్ పేటకు చెందిన ప్రణీత్ ఎం.ఎస్. చదివేందుకు కెనడాకు వెళ్లాడు. తన పుట్టిన రోజు కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్ ప్రాంతానికి ఔటింగ్ కి వెళ్లాడు. ఈ తరుణంలోనే లేక్ లో ఈత కొట్టేందుకు ప్రణిత్ డైవ్ చేశాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మరణించాడు. తమ కుమారుడు మరణించాడనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. పుట్టిన రోజు నాడే మరణించాడని రోదనలు మిన్నంటాయి. త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరువ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.