ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. విశ్వ విద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు ఇచ్చామని తెలిపారు.
ముఖ్యంగా పరిశోదన పై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్తలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉన్న సీనియర్ ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు మంత్రి లోకేష్. వీసీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 28న చివరి తేదీ అని ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు.