ముగిసిన మేడారం జాత‌ర.. కోటి 30 ల‌క్షల మంది భ‌క్తులు సంద‌ర్శ‌న‌

-

ఆసియాలోనే రెండో అతి పెద్ద జాత‌ర నిన్న‌టితో ముగిసింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ జాత‌ర అంగ రంగ వైభవం జ‌రిగింది. కాగ శ‌నివారం రాత్రి.. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ల‌ను గ‌ద్దె నుంచి వ‌న ప్ర‌వేశం అట్ట హాసంగా సాగింది. స‌మ్మ‌క్క ను చిలుక‌ల గుట్ట‌కు, సార‌ల‌మ్మ ను క‌న్నెప‌ల్లికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అలాగే ప‌గిడిద్ద రాజును మహబూబాబాద్ జిల్లా గంగారం పూనుగొండ్ల‌కు తీసుకెళ్లారు. గోవింద రాజును ఏటూరు నాగ‌రం మండ‌లంలో గ‌ల కొండాయికి పూజారులు తీసుకెళ్లారు.

దీంతో మేడారం జాత‌ర వ‌న ప్ర‌వేశ ఘ‌ట్టం ముగిసింది. కాగ ఈ సారి ఈ మెగా జాత‌రకు కోటి 30 ల‌క్షల మంది భ‌క్తులు వ‌న దేవ‌త‌ల‌ను సంద‌ర్శించుకున్నారు. కాగ జాత‌రకు ముందే.. దాదాపు 50 ల‌క్షల మంది అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. అదే విధంగా మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ తో పాటు ప‌లువురు సంద‌ర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వ‌న దేవ‌త‌ల‌ను సంద‌ర్శించుక‌న్నారు. నాలుగో రోజు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళ సై సౌంద‌ర రాజ‌న్ కూడా స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను గ‌ద్దెల పై ద‌ర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version