ఎమ్మెల్సీ కవితను అడ్డుకున్న పోలీసులు.. ఎందుకంటే?

-

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ట్యాంక్ బండ్ సమీపంలోని 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను అంబేద్కర్‌కు నివాళులర్పించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

విగ్రహంలోని మొదటి అంతస్తులోకి వెళ్లడానికి పోలీసులు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ శ్రేణులకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జై భీమ్ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. పోలీసులతో స్వల్ప వాగ్వాదం అనంతరం ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మందిని మొదటి అంతస్తుకు పోలీసులు అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Latest news