హైదరాబాద్ చేరుకున్న ప్రధాని.. స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి తలసాని

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అలాగే బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘనస్వాగతం పలికింది. అనంతరం బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో నోవాటెల్ హోటల్ కు వెళ్లారు ప్రధాని.

అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో హెచ్ఐసీసీ కి చేరుకున్నారు. కాగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పాల్గొంటారు. రాత్రికి నోవాటెల్ హోటల్లో మోదీ బస చేయనున్నారు.