కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ నివేదిక పై కేబినెట్ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కి నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు.
అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. ఆగస్టు 31న పీసీ ఘోష్ కమిషన్ అందించింది. పూర్తి స్థాయిలో విశ్లేషించి.. సంక్షిప్తంగా నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్, లా సెక్రెటరీ, జీఐడీ సెక్రెటరీ లతో చర్చించి నివేదికను కేబినెట్ లో చర్చించారు. 16 నెలల తరువాత 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ అందించింది. ఆ నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాం. ఇది రాజకీయ పార్టీ నివేదికో.. ప్రభుత్వ పార్టీ నివేదికో కాదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక అన్నారు. పీసీ ఘోష్ నివేదిక ను కేబినెట్ ఆమోదించింది. ప్రాజెక్ట్ కట్టిన మూడేళ్లలోనే కూలిపోయిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎంక్వైరీ చేపట్టాం. నివేదికను అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.