గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటి వద్ద అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. నిన్న అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో వేలాది సంఖ్యలో కేటీఆర్ ఇంటికి గులాబీ పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసు… రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు కూడా చేర్చినట్లు వార్తలు వచ్చాయి. లగిచర్ల ఘటనలో కేటిఆర్ పేరు FIRలో చేర్చడంతో రాత్రి నుండి నందినగర్ లోని కేటిఆర్ ఇంటికి భారీగా తరలివచ్చారు కార్యకర్తలు.
దీంతో పట్నం మహేందర్ రెడ్డి లాగానే…గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే… నంది హిల్స్ లోని కేటీఆర్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే… దీటుగా ఎదుర్కొనేందుకు గులాబీ సైనికులు రంగంలోకి దిగారు. ఇక అటు ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ పైన దాడి.. కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం?!
లగిచర్ల ఘటనలో కేటిఆర్ పేరు FIRలో చేర్చడంతో రాత్రి నుండి నందినగర్ లోని కేటిఆర్ ఇంటికి భారీగా తరలివస్తున్న కార్యకర్తలు! #TelanganaPolitics #Telangana#KTRArrest#Lagicharla @BRSparty @CongressTS @TelanganaDGP pic.twitter.com/ZYaIOIHAbk— Pulse News (@PulseNewsTelugu) November 14, 2024