కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది : అమిత్ షా

-

ఓవైసీ కోసమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు అని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో నిర్వహించిన బీజేపీ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే.. అవినీతి, అక్రమాలే అని పేర్కొన్నారు అమిత్ షా. తెలంగాణలో మద్యం ఏరులై పారుతుంది. అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు అమిత్ షా. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.

కేసీఆర్ ప్రభుత్వ కుంభకోణాలు లెక్కపెడితే వారం రోజులు సరిపోవు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని తెలిపారు అమిత్ షా. బీజేపీ రాష్ట్రంలో గెలిపిస్తే.. బీసీని సీఎం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని.. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే వారి లక్ష్యం అని తెలిపారు. మా వారసులు సీఎం కారు.. బీసీ నేతలే ఆ పదవీలో ఉంటారు. మిషన్ భగీరథ కింద బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని అమిత్ షా విమర్శించారు. కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని తెలిపారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Exit mobile version