కళ్ళు తిగిరి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

-

    • ఇటిక్యాల్‌ రోడ్‌ షోలో స్పృహ తప్పిన ఎమ్మెల్సీ కవితి
    • ఆందోళనకు గురైన బిఆర్‌ఎస్‌ నేతలు,కార్యకర్తలు

తెలంగాణలోని ఇటిక్యాల్‌లో రోడ్ షోలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె,బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పృహ తప్పి పడిపోయారు. BRS కార్యకర్తతో ఓపెన్ వాహనంపైన నిలబడి మైక్ ద్వారా ప్రసంగించారు. ఇంతలో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. వాహనంలో ఆమెతో పాటు నిలబడిన సహచరులు ఆమెను పట్టుకున్నారు.తదనంతరం సపర్యలు చేశాక కొంతసమయం తర్వాత ఆమె కోలుకుంది.ఆమె పడిపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు,కార్యకర్తలు కొంత ఆందోళనకు గురయ్యారు.హుటాహుటిన వైద్యులను తీసుకువచ్చారు. రోడ్‌ షోలో డీహైడ్రేషన్ కారణంగానే కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తేల్చారు. ఆమె కోలుకోవడంతో స్వల్ప విరామం అనంతరం రోడ్‌ షో ను మళ్ళీ ప్రారంభించారు.

పరిస్థితి మెరుగయ్యాక ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌ అకౌంట్‌లో కార్యకర్తలనుద్దేశించి ట్వీట్‌ చేశారు.అలాగే ఒక అమ్మాయితో కలిసి కూర్చుని మాట్లాడుతున్న వీడియోను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని చెప్పారు.కొద్దిగా నెర్వస్‌నెస్‌కు గురయ్యానని క్షమించాలని మెసేజ్‌ చేశారు.నేను బాగానే ఉన్నాను, నేను ఈ అందమైన చిన్న అమ్మాయిని కూడా కలిశాను.ఆ చిన్నారితో కొంత సమయం గడిపిన తర్వాత ఇంకొంచెం ఉత్సవాహంగా తయారయ్యారు అని ట్విట్టర్‌లో రాసుకున్నారు.

ఇదిలా ఉండగా 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి విజయం సాధించిన అభ్యర్ధులను ప్రకటించనున్నారు. కాగా తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆసక్తికర త్రిముఖ పోటీ నడుస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా పిలువబడే భారత రాష్ట్ర సమితి (BRS) 119 స్థానాలకు గాను 88 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేయాలని బిఆర్‌ఎస్‌ నేతలు శాయశక్తులా కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version