అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు మంత్రి తలసాని. కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నేడు అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదు అన్నారు.
అమీర్ పేట లో TDP వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి NTR విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 1994 లో నాటిన మొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు వృక్షం గా అభివృద్ధి చెందింది అని తెలిపారు. నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన మహనీయులు NTR ను ఎప్పుడు మరువను అని స్పస్టం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ని అస్సలు మరిచిపోనని తెలిపారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు BRS ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగిందని తెలిపారు.