తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్నారు తెలంగాణ అసెంబ్లీ సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనుంది శాసన మండలి. అనంతరం రెండు బిల్లులను ఆమోదించనుంది తెలంగాణ అసెంబ్లీ.
అనంతరం స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం తెలుపునుంది తెలంగాణ అసెంబ్లీ సభ.. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ కూడా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. ఇక అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం..కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీయనున్నారు.