నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు…ఇవాళ ఉదయం 10:30 న్నర గంటల సమయాన తీర్పు వెల్లడించనుంది.
నేడు హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు లీగల్ టీం తో వెళ్లారు మాజీమంత్రి కేటీఆర్. తన వెంట లీగల్ టీం ని అనుమతించకపోవడంతో ఏసీబీ విచారణకు వెళ్లలేదు కేటీఆర్. దీంతో విచారణ అంశాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లనుంది ఏసీబీ. ఇక ఇవాళ్టి తీర్పు మీదే కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారు. ఏసీబీ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో ఫార్ములా ఈ రేస్ కొనసాగుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఈడికి తెలిపారు కేటీఆర్. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిక్వెస్ట్ ని ఆమోదించిన ఈడి తదుపరి విచారణ తేదీ ప్రకటించలేదు ఈడీ.