ఇవాళ సెక్రటేరియట్ ముందు మూసీ బాధితుల శాంతియుత ర్యాలీ

-

ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు మూసి బాధితులు. మూసి ప్రక్షాళనలో భాగంగా… మూసి చుట్టుగా ఉన్న ఇండ్లను కూల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 15,000 మంది ఇండ్లను కూల్చేందుకు సర్వే నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే ప్రకటించింది.

కానీ దీనిపై… మూసి బాధితులు.. ససే మీరా అంటున్నారు. తమకు తమ ఇల్లే కావాలని… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అస్సలు వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో శాంతి ర్యాలీకి.. శ్రీకారం చుట్టారు లంగర్ హౌస్ మూసి బాధితులు. ఇవాళ ఉదయం 8 గంటలకు సెక్రటేరియట్ ముందు శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు లంగర్ హౌస్ మూసి బాధితులు. ఈ ప్రకటన నేపథ్యంలో మూసి బాధితులను అక్కడికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version