యువకులు ఈ ఆహార పదార్థాలను డైట్ లో తప్పక తీసుకోవాలి..!

-

ప్రతి ఒక్కరూ సరిపడా ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా యువకులు మంచి నాణ్యత గల ఆహారం, న్యూట్రియంట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. న్యూట్రియంట్స్ లేని స్నాక్స్ లాంటివి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

వీలైనంత వరకూ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడమే మంచిది. అయితే ముఖ్యంగా టీనేజర్స్ తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఈ రోజు చూద్దాం..!

చిలకడ దుంపలు

చిలకడదుంపలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. వీటి వల్ల వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది.

నట్స్

నట్స్ లోని జింక్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ప్రతి రోజూ గుప్పెడు నట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

అరటి పండు

అరటి పండు లో విటమిన్ బి, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది ఎనర్జీ ని ఇస్తుంది.

గుడ్లు

గుడ్లలో కూడా విటమిన్స్, మినరల్స్, జింక్ ఉంటాయి. ఉడికించిన గుడ్లని బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకుంటే మంచిది.

ఆకుకూరలు

ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బ్రోకలీ, తోటకూర బీన్స్ మొదలైన వాటిని తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

పాలు

పాలల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రోటీన్స్ మరియు విటమిన్ బీ12 ఉంటాయి. ఇది ఎముకలని పుష్టిగా ఉండేటట్టు చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version