కేసీఆర్-రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్-రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ-కార్ రేస్  కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయన ఏమైనా దేశం కోసం పోరాడారా..? అని ప్రశ్నించారు. రేవంత్, కేసీఆర్ కుటుంబాల మధ్య ఒప్పందం ఉండటం వల్లనే కేసులో ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు.

కేసీఆర్ ఫ్యామిలీ అంతా అవినీతిమయమన్నారు. ఈ-కార్ రేసులో ప్రభుత్వానికి రూ.700 కోట్ల లాభాలు ఎక్కడ వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారో లేదో కూడా అనుమానమేనని తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు. కచ్చితంగా వారి అవినీతిని బయటపెడుతామన్నారు. పొంగులేటి బాంబులు బాంబులు అన్నారు. దీపావళి పోయింది.. ముక్కోటి ఏకాదశి వెళ్లింది. రేపు సంక్రాంతి కూడా పోతుంది. కానీ అవి పేలవని విమర్శించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news