తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకత్వంలో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తలను కొట్టి పడేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టీం తోనే ఎన్నికలకు వెళతామన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికలు వస్తే బిజెపికి ప్రజలే అభ్యర్థులను ఇస్తారని అన్నారు. తమకు నాయకత్వ సమస్య లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీకాలం ఫిబ్రవరిలో ముగియను ఉండడంతో ఆయనని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని.. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు కట్టబెడతారని ఊహాగానాలు వెలుగడ్డ నేపథ్యంలో వీటిపై కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇక కవిత అరెస్టును సిబిఐ చూసుకుంటుందన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వారి పేర్లు బయటపడ్డాయని.. దీంతో కేంద్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రధానిపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.