అక్కడ టీ వరస్ట్‌గా ఉంటుందన్నా ఎగబడి తాగుతున్న జనం..!

-

ఈరోజుల్లో రెస్టారెంట్లు, వాటిపేర్లు అన్నీ వెరైటీగా ఉంటున్నాయి.. రెస్టారెంట్స్‌ అయితే..ఇంటీరియర్‌ డిజైన్‌కు బాగా ఖర్చుపెడుతున్నాయి..యూత్‌ ఎక్కువ వస్తారు.. వచ్చినవాళ్లు సెల్ఫీలు, వీడియోలు తీసుకోక మానరు.. మన రెస్టారెంట్‌ లుక్‌ బాగుంటే.. ఈ కారణంతోనే ఎక్కువగా వస్తారు. అందుకే ఖర్చుకు వెనకాడకుండా..డెకరేషన్‌కు హోటల్‌ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుంది. ఇక రెండో మార్కెటింగ్‌ స్ట్రాటడీ పేరు..మీరు ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు.. బావా బిర్యానీ తింటావా, వచ్చితినిపో, ఎంబీఏ ఛాయ్‌వాలా ఇలాంటి క్రేజీ పేర్లు పెడుతున్నారు. అలాంటి ఓ క్రేజీ పేరే బొకరోస్‌ వరస్ట్‌ టీ. టీ చెండాలంగా ఉందని పేరు పెడితే..ఎవరైనా వస్తారా అనుకుంటారేమో…అక్కడ ఛాయ్‌ కోసం క్యూ కడతారట.!
జార్ఖండ్‌లోని బొకారో జిల్లా గుండా వెళుతున్న జాతీయ రహదారి-23లో టెలిదిహ్ మలుపు దగ్గర ‘బొకారోస్ వరస్ట్ టీ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. టీ ప్రేమికులు చాలా ఉత్సాహంతో టీ తాగడానికి ఇక్కడకు వస్తారు. నిజానికి ఇక్కడ టీ చాలా బాగా తయారు చేస్తారు. కానీ ఈ దుకాణం పేరు ‘బొకారోస్ వరస్ట్ టీ’. ఈ దుకాణం దాని పేరు కారణంగా బాగా వైరల్‌ అవుతోంది.  హైవే మీదుగా వెళ్లేవాళ్లు టీ దుకాణం పేరు చూడగానే ఆగి, టీ రుచి చూసిన తర్వాతే వెళ్తారట..
టీ దుకాణం వైపు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఈ ప్రత్యేకమైన పేరు పెట్టినట్లు టీ దుకాణం యజమాని శుభం సింగ్  అన్నారు. ముఖ్యంగా టీ ప్రియులు టీ తాగేందుకు వస్తున్నారని శుభమ్ సింగ్ తెలిపారు. షాప్ పేరు వింటేనే ఒక్కసారి టీ తాగడానికి కచ్చితంగా వస్తారట… ఒకసారి టీ తాగితే మళ్లీ మళ్లీ వస్తారు.

కప్పు టీ రూ.10, రూ.15లకు..

ఇక్కడ టీని స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తామని టీ మేకర్‌ తెలిపారు..అంటే అందులో నీటిని ఉపయోగించరు. యాలకుల రుచి కోసం వాడతారు.. టీ మట్టి కుల్హాద్‌లో ఇస్తారు. దీంతో టీకి తీపి వాసన రావడంతో ప్రజలు ఉత్సాహంగా తాగుతున్నారు. చిన్న కప్పు టీ రూ.10కి, పెద్ద కప్పు రూ.15కి విక్రియిస్తారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version