టికెట్ పోయిన BRS ఎమ్మెల్యేలు వీరే..!

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థుల వివరాలను చెప్పారు. ముఖ్యంగా ఏడు స్థానాల్లో మార్పులు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి – ఉప్పల్, రాజయ్య – స్టేషన్ ఘనపూర్, రాములు నాయక్ – వైరా, రేఖా నాయక్ -ఖానాపూర్, చెన్నమనేని రమేష్ – వేములవాడ, గంప గోవర్ధన్ -కామారెడ్డి,  రాథోడ్ బాపురావు -బోధ్, విద్యాసాగర్ రావు – కోరుట్ల వీరికి టికెట్లు దక్కలేదు.

టికెట్లు దక్కని వారు నిరాశ చెందకూడదని సూచించారు సీఎం కేసీఆర్. వారికి త్వరలోనే ఏదో ఒక విధంగా పార్టీ తరుపున మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. 115 అసెంబ్లీ నియోజకవర్గం ప్రకటించారు. అక్టోబర్ 16 న వరంగల్ లో సింహ గర్జన తో పాటు భారీ ర్యాలీ ఉంటుందని వెల్లడించారు.  అదేరోజు టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని వెల్లడించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news