ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు. విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కింది విధంగా ఉన్నాయి.
1. మియాపూర్-చందానగర్-బీహెచ్ఈఎల్-పటాన్ చెరు (14 కిలోమీటర్లు)
2. ఎంజీబీఎస్-ఫలక్ నుమా-చాంద్రాయణగుట్ట-మైలాదేవర్ పల్లి-పీ7 రోడ్డు-ఏయిర్ పోర్టు (23 కిలోమీటర్లు)
3. నాగోల్-ఎల్బీనగర్—ఓవైసీ హాస్పిటల్-చాంద్రాయణ గుట్ల-మైలాదేవర్ పల్లి-ఆరాంఘర్-న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కిలోమీటర్లు)
4. కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుండి/అమెరికన్ కాన్సూలేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్ బీ రోడ్డు (12 కిలోమీటర్లు)
5. ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్ నగర్(8 కిలోమీటర్లు)
పై వాటికి సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి సెంట్రల్ అర్బన్ డెవలప్ మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ హర్దిప్ సింగ్ పూరికి డ్రాఫ్టు లెటర్ ను సిద్ధం చేసి పంపించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రోరైలు ఎండీని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 40 కిలోమేటర్ల మేర మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్ ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుండి నార్సింగి వయా నాగోల్, వయా ఎంజీబీఎస్ చేపట్టాలని కోరారు.