నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనునంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీతో పాటు కీలక నేతలు ఇవాళ గాంధీభవన్‌లో మ. 2 గంటలకు సమావేశం కానున్నారు. లోక్ సభ ఎన్నికల ప్లానింగ్, అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు.
ఇది ఇలా ఉండగా, నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష జరిపారు. సమీక్షలో భాగంగా మెట్రోరైలు ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి గారు రెండో దశ ప్రతిపాదనలపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు. దీని కోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలని మెట్రోరైలు ఎండీ ని ఆదేశించారు.