మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కనుంది. ఈ మేరకు బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్..ఇవాళ పార్లమెంట్ లో పెట్టనుంది. అయితే, చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై చర్చ నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉంది. అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు,జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెంతో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.