తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా…. 13 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల సమయానికి పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాల పల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్త గూడెం, అశ్వరావు పేట, భద్రాచలం నియోజకవర్గం ఈ జాబితాలో ఉన్నాయి.
ఓటు వేసేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకూడదు
* సెల్ ఫోన్ ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లొద్దు.
* అక్రమంగా తీసుకెళ్లి సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఓటును లెక్కించరు.
* పోలింగ్ కేంద్రంలో కెమెరాలతో ఫోటోలు తీయకూడదు. ల్యాప్టాప్ ను కూడా అనుమతించరు.
* ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్పు, ఏదైనా గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి.