తెలంగాణ పెన్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్ పెంపు చేస్తామని… ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి సీతక్క ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని వివరించారు సీతక్క.
నిన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం లో పాల్గొన్న సీతక్క… పలువురికి కృత్రిమ యంత్రాలు అలాగే వినికిడి యంత్రాలు అటు ఇతర పరికరాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. మాట్లాడడం జరిగింది. ఇండియాలో పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా దివ్యాంగుల పెన్షన్ను వెయ్యి రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తెలంగాణ దివ్యాంగుల పెన్షన్ తాము కూడా పెంచబోతున్నట్లు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని భరోసా కల్పించారు తెలంగాణ మంత్రి సీతక్క.