తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విలన్ కాబట్టే విలన్ అని అంటున్నారు అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని సీఎంగా మార్చుతామంటే మేము ఎందుకు వద్దు అంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న వల్ల ఏమి సాధ్యం అవుతుంది.. ఆర్. కృష్ణయ్య చేయనిది రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామన్నారు. మల్లన్న మంత్రి పదవీ కోసమో.. ఇంకో పదవీ కోసమో ఆశ పడే వ్యక్తి కాదన్నారు.
బీసీ ముఖ్యమంత్రి ఎవరు.. ఆయన పేరు ఏంటి..? అడగడం కరెక్ట్ కాదు అన్నారు. సాధారణంగా ఒక పని చేస్తే తరతరాలు మన పేరు గుర్తుండాలి.. రేవంత్ రెడ్డి పని చేస్తే తోటి మంత్రులే ఆయన పేరు మర్చిపోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.