తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని దానిని అందిపుచ్చుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. పదవీని పొందేటప్పుడు ఉండే ఆరాటం పని చేసేటప్పుడు కూడా ఉండాలన్నారు. పని విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని డివిజన్ అధ్యక్షులైనా ఎవరైనా 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. అలా లేని వారు రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు ఈటల రాజేందర్. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జిల్లా అధ్యక్షుల కోసం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొందని.. భవిష్యత్ లో పార్టీ మరింత బలంగా ఉంటుంది అనడానికి ఇదే సంకేతం అన్నారు. పార్టీ అధ్యక్షులు అందరూ పార్టీకి మచ్చ తేకుండా ప్రతీ ఒక్కరినీ కలుపుకొని పోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం పతనం కావడానికి పదేళ్లు పడితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై వ్యతరేకత రావడానికి 10 నెలల సమయమే పట్టిందని విమర్శించారు. పది నెలలుగా బీజేపీ అనేక సమస్యలపై కొట్లాడిందన్నారు.