సింగరేణి సంస్థ చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక ఘట్టమని.. ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం సంతృప్తినిచ్చిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్ వేదిక గా స్పందించిన కేంద్రమంత్రి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చొరువలో తాను భాగస్వామి అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం అవతల బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం సింగరేణి సంస్థ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి వెలుపల మొట్ట మొదటిసారి ఒడిశాలోని నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిందని.. బొగ్గు ఉత్పత్తిని విస్తరించడం పట్ల భారత ఇంధన లభ్యత, ఆర్థిక ప్రగతిలో నానాటికీ పెరుగుతున్న తన భాగస్వామ్యం పట్ల సింగరేణి సంస్థ ఇది గర్వించదగిన క్షణమని హర్షం వ్యక్తం చేశారు.