తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి బీఆర్ఎస్ కి పట్టం గట్టారు ప్రజలు. ప్రభుత్వం పై వ్యతిరేకత కారణంగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయనున్నట్టు హామీ ఇవ్వడంతో అందుకు కనెక్ట్ అయిన ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకే తమ ఓట్లను వేశారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు 65 స్థానాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా. అయితే బీఆర్ఎస్ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడక్కడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వరకు మెజార్టీ బాగానే ఉంది. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఘన విజయం సాధించారు. ఎవ్వరూ ఊహించనివిధంగా 85,576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలో అత్యధిక మేజార్టీతో విజయం సాధించింది వివేకానందనే కావడం గమనార్హం. ప్రతీ రౌండ్ లో కూడా వివేకానంద లీడ్ లో కొనసాగారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై విజయం సాధించారు.