తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన లోగోను తాజాగా మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ లోకను మార్చుతామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన… కొత్త లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో తెలంగాణ స్టేట్ అనే పదం ఉండేది. కానీ కొత్త లోగోలో స్టేట్ అనే పదాన్ని తీసివేశారు. కేవలం తెలంగాణ పోలీస్ అని ఉండే కొత్త లోగోను రూపొందించిందట రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు ఈ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే… తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ తీసుకువచ్చిన సంస్కరణలను, ఆయన చేపట్టిన పనులలో కీలక మార్పులు చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖలో కూడా వేలు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్.
తెలంగాణ పోలీస్ కొత్త లోగో ఇదే
గత లోగోలో ఉన్న ‘STATE’ అనే పదాన్ని తొలగించి కొత్త లోగో ఆవిష్కరణ pic.twitter.com/U0o0CHCaDr
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2024