తెలంగాణకు కేంద్రం శుభవార్త..రాష్ట్రంలో మరో 3 ESI హాస్పిటల్స్

-

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ లో మరో మూడు ఈఎస్‌ఐ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంగారెడ్డి, శంషాబాద్, రామ గుండం లలో స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్.

ప్రధాని మోడీ-సీఎం కేసీఆర్

నాచారం , రామ చంద్ర పురం ల్లో నిర్మించిన హాస్పిటల్స్ ని త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సనత్ నగర్ ESI హాస్పిటల్ కి కాత్ లాబ్స్… Nuclear medicine, radio tharpi యూనిట్ లు…దేశం లో రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు.. అందులో ఒకటి..హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ESI హాస్పిటల్స్ ల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేస్తున్నామని.. వైద్య వృత్తి అమూల్య మైనది… దేశానికి భవిష్యత్ మీరు అంటూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version